![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్లిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu).ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -364 లో..... సీతాకాంత్ ని రామలక్ష్మి ఫోటో దగ్గరికి తీసుకొని వెళ్తాడు రామ్.. మా మిస్ ఇంకా నీ భార్య రామలక్ష్మి ఒకేలా ఉండడం వల్లే కదా.. నువ్వు మా మిస్ వెంట పడుతున్నావని రామ్ అనగానే నా బాధ నీకు అర్థం అయింది.. ఇక తనకెప్పుడు అర్ధమవుతుందోనని సీతాకాంత్ అనుకుంటాడు. ఆ తర్వాత శ్రీలత వాళ్లు టిఫిన్ చెయ్యడానికి కూర్చుంటారు. అప్పుడే సీతాకాంత్ వస్తాడు. రమ్యని పెళ్లి చేసుకోమని సీతాకాంత్ ని శ్రీలత అడుగుతుంది. ఇక ఆ టాపిక్ వదిలెయ్యండి అని సీతాకాంత్ అంటాడు.
అంటే ఇప్పుడు రమ్య పరిస్థితేంటి? ఇంతవరకు వచ్చి ఇలా జరిగిందంటే అందరు చిన్నచూపు చూస్తారని శ్రీలత అంటుంది. నేను ముందే రమ్యతో అన్ని చెప్పిన. తను ఒప్పుకుంటేనే ఎంగేజ్ మెంట్ వరకు వచ్చానని సీతాకాంత్ అంటాడు. అయిన ఇప్పుడు తన గురించి కూడా ఆలోచించాలి కదా అని శ్రీలత అంటుంది. నా భార్యకి తప్ప ఎవరికి చోటు లేదని సీతాకాంత్ చెప్తాడు. దాంతో రమ్య ఏడుస్తూ డోర్ వేసుకుంటుంది. సీతాకాంత్ టెన్షన్ పడుతూ డోర్ నెట్టి లోపలికి వెళ్తాడు. రమ్య ఏదో టాబ్లెట్ వేసుకోబోతుంటే ఆపుతాడు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడ నేను పెళ్లి చేసుకోనని సీతాకాంత్ అనగానే.. ఇక నా మాట కూడా విను.. ఈ వారం రోజులు టైమ్ ఇస్తున్నా. ఈ లోపు రమ్య ని పెళ్లి చేసుకోవాలి లేదంటే నేను చచ్చిపోతానని శ్రీలత అనగానే సీతాకాంత్ షాక్ అవుతాడు.
ఆ తర్వాత మన ప్లాన్ సక్సెస్ అంటూ శ్రీలత, శ్రీవల్లి, రమ్య లు హ్యాపీగా ఫీల్ అవుతారు. రామలక్ష్మికి శ్రీలత ఫోన్ చేసి.. రమ్య ఇలా సుసైడ్ చేసుకోబోయింది నేను సీతాకి వారం రోజులు టైమ్ ఇచ్చానని శ్రీలత చెప్పగానే రామలక్ష్మి షాక్ అవుతుంది. అయితే నాకేంటి మీ ఫ్యామిలీ విషయాలు నాకెందుకు చెప్తున్నారని రామలక్ష్మి ఫోన్ కట్ చేస్తుంది. తను మైథిలీనో కాదో నేను తెలుసుకుంటాను.. ఒకవేళ రామలక్ష్మి అయితే తన గదిలో బావగారికి సంబంధించినవి ఉంటాయి కదా అని శ్రీలత వాళ్ళతో అంటుంది. రామ్ ని తీసుకొని వెళ్లి నా ప్లాన్ అమలు చేస్తానని శ్రీవల్లి అంటుంది. మరొకవైపు ఎందుకు రమ్య ఇలా చేస్తుందని సీతాకాంత్ ఆలోచిస్తుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |